చిత్తూరు జిల్లా క్రీడాకారణి భారతదేశం తరపున జెక్కార్స్లో జరిగిన 18వ ఎషియన్ గేమ్స్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించి మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఇ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ఎషియన్ గేమ్స్‌లో హాకీ మహిళ జెట్ సిల్వర్ మెడల్ సాధించడం అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా క్రీడా సాధికారిక సంస్థ పిఇఒ లక్ష్మి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శాంతారెడ్డి, శ్రీదర్‌లు, రాష్ట్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎ ప్రసన్న కుమార్ రెడ్డి, పికాం డైరెక్టర్ సురేందర్ రెడ్డి,మున్సిపల్ కార్పొరేషన్ డివై ఇఒ ఆనంద్ కుమార్, ఎస్ఎస్ మునిరత్నం, రెజిలింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎం సురేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
సిల్వర్ మెడల్ విజేత రజనీకి ఘన స్వాగతం
