ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
సుప్రసిద్ధ తెలంగాణ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పేరిట ప్రతి ఏటా లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలకు అవార్డు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దాశరథి క ష్ణమాచార్య అవార్డు 2016ను తెలంగాణ భాషా సంస్క తిక శాఖ ప్రకటించింది. 2016కు గాను ఈ అవార్డు డాక్టర్ జె.బాపిరెడ్డికి అందజేయనున్నారు. ఈ నెల 22న దాశరధి జయంతి సందర్భంగా ఈ పురస్కారం ప్రధానం చేస్తారు. తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ అవార్డు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ రావికంటి వాసునందన్, ప్రొఫెసర్ మసన చెన్నప్పలు సభ్యులుగా, సాంస్క తికశాఖ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ డాక్టర్ జె.బాపిరెడ్డిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించింది. అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల నగదుతోపాటు దాశరథి స్మారక అవార్డును ప్రభుత్వం అందజేయనున్నది.