తిరుపతి టౌన్ : సుందరయ్యనగర్‌లో ఉన్న 46, 47 రేషన్‌షాపుల వద్దనే ఆధార్ అనుసంధానం చేసి, బియ్యం పంపిణీ చేయాలని సిపిఎం శాఖా కార్యదర్శి నరేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-పాస్ విధానంలోని బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసే బియ్యం పంపిణీ చేయాలని కోరారు. కొన్ని చోట్ల ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
రేషన్ షాపుల వద్దే ఆధార్ అనుసంధానం చేయాలి : సిపిఎం
