ప్రముఖ దేశీయ మొబైల్ తయారీ సంస్థ డీటెల్... 'డి1 స్లిమ్' పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ ఆవిష్కరించింది. తక్కువ ధరలో విడుదలైన ఈ ఫీచర్ ఫోన్.. డీ1కు సక్సెసర్ వెర్షన్‌గా తీసుకొచ్చారు. డిజిటల్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్ ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత అని ఈ సంస్థ చెబుతోంది. గతంలో రూ.299 కే 'డీ1' ఫీచర్‌ఫోన్ తీసుకొచ్చామని, దేశీయంగా అతి తక్కువ విలువైన మొబైల్ ఫోన్‌ను అందించిన ఘనత కూడా తమదేనని ఆ సంస్థ చెబుతోంది. ఆధునిక స్థాయి ఫీచర్లు, డిజైన్‌తో ఈ 'డీ1 స్లిమ్' ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించనుందని ఆ సంస్థ గట్టి నమ్మకంతో వుంది. 2.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్లో నిక్షిప్తం చేశారు. బ్లూ, గోల్డ్, పింక్ - మూడు కలర్ వేరియంట్లలో లభించనున్న ఈ ఫీచర్ ఫోన్ ధర రూ.1199. ఈ ఫోన్ బీటుబీ అడ్డా వెబ్సైట్లో అమ్మకానికి సిద్ధంగా వుంది
చవకైన ఫీచర్ ఫోన్.. 'డీటెల్ '
