1.బ్రహ్మసమాజ మతానికి మూలం ? - ఉపనిషత్తులు
2.ఆసఫ్జాహి వంశంలో అగ్రగణ్యుడు ?
- ఉస్మాన్ ఆలీఖాన్
3. హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రభుత్వం తన తరపున నియమించిన ముఖ్య ప్రతినిధి ?-కె.ఎం.మున్షీ
4.అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు విజయవాడలో జరిగిన సంవత్సరం ? - 1921
5.తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయుడు ?
- సి.పి. బ్రౌన్
6.అసఫ్ జాహీ వంశంలో చివరి నిజాం ?
- ఉస్మాన్ ఆలీఖాన్
7.భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంధ్రుడు ?
- పి.ఆనందాచార్యుడు
8.ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 1926లో మొదట ఎక్కడ స్థాపించారు ? - విజయవాడ
9.ఉర్దూను రాజభాషగా చేసిన నిజాం రాజు ?
- మహబూబ్ ఆలీఖాన్
10.హైదరాబాద్ రాజ్యంలో ఆంధ్ర జనసంఘం ఏర్పడిన సంవత్సరం ? - 1921
11. ఆంధ్రలో పన్నుల నిరాకరణోద్యమానికి సంబంధం ఉన్న గ్రామం ? - పెదనందిపాడు
12. భావార్థ దీపిక రరయిత ? - జ్ఞానేశ్వరుడు
13. సింహాసన ద్వాత్రింశక రచయిత ?
- కొరవి గోపరాజు
14.పాలంపేటలో ఉన్న రాయప్ప దేవాలయాన్ని నిర్మించిన సంవత్సరం ? - క్రీశ.1213
15. మహ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ సింహాసనాన్ని అధిషించిన సంవత్సరం ? - 1518
16. పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ?
- పానగల్లు ( నల్లగొండ జిల్లా)
17.కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు ? - మార్కోపోలో
18.పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి ? - రేచర్ల రుద్రుడు
19. మతపరంగా, విద్యా విషయకంగా దక్షిణ కాశీగా పేరుపొందిన నగరం ? - కంచి
20. బాదామి దేనికి ప్రసిద్ధి ?
- నిర్మాణాత్మక దేవాలయాలుకు పేరుగాంచింది.
21. కంచి వరకూ రాజ్యాన్ని విస్తరింపజేసిన కాకతీయరాజు ? - గణపతి దేవుడు
22. మౌర్య పరిపాలన నుంచి ఎవరి నాయకత్వంలో ఆంధ్రులు స్వాతంత్య్రాన్ని సాధించారు ? - శాతవాహనులు
23. ఎవరి కాలంలో ముస్లింలు ఆంధ్రదేశంపై దాడిచేసి ఆక్రమించారు ? - కాకతీయుల కాలంలో
24. విజయనగర సామ్రాజ్యంలో కొండవీడు రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో విలీనమైంది ? - రెండో దేవరాయులు
25.హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ?
- మహమ్మద్కులీ కుతుబ్‌షా
26. ఆంధ్రదేశంలో స్వాతంత్ర సమరం దేనితో ప్రారంభమైంది
- వందేమాతర ఉద్యమ విస్తరణతో
27. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ?
- రుద్రాంబ (రుద్రమదేవి)
28. బొబ్బిలి యుద్ధంతో సంబంధం ఉన్న ఫ్రెంచి సేనాని? - బుస్సీ
29.మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించిన వారు ? - కందుకూరి వీరేశలింగం
30. మొదటి నైజాం -ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం ?
-జోగిపేట
31. పల్నాడు సత్యాగ్రహం దేనికి సబంధించింది ?
- అటవీ చట్టాలు
32. ఖిలాఫత్ ఉద్యమ స్థాపకుడు ? - మహమ్మద్ ఆలీ
33. క్విట్ ఇండియా ఉద్యమ ప్రతిపాదనాకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ? - పట్టాభి సీతారామయ్య
34. చాందా రైల్వే ఉద్యమానికి సంబంధించి నిజాం రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురైన వారు ?
- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
35. హైదరాబాద్‌లో వివేకవర్థిని విద్యా సంస్థను ఎవరు స్థాపించారు ? - మహారాష్ట్ర నాయకులు
36. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌ను స్థాపించిన సంవత్సరం ? - 1938
37. రజాకార్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ? - 1940
38.తెలంగాణలో ఆంధ్ర మహాసభలను ఎదుర్కొనేందుకు నిజాం ఏ సంవత్సరంలో ఇతైహాదులో ముస్లిమీన్ సంస్థను స్థాపించారు ? - 1927
39. వీర తెలంగాణ రచయిత? - రావి నారాయణ రెడ్డి
40.శ్రీ బాగ్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది ?
- 1937 నవంబర్ 16న
41.యథాతథ ఒడంబడిక ఎప్పుడు కుదిరింది ?
- 1947 నవంబర్ 29న
42. నేషనలిస్ట్ ఆంధ్ర మహాసభ స్థాపకుడు ?
- కె.వి రంగారావు
43.థార్ కమీషన్ (1948) ఎప్పుడు ఏర్పాటైంది ?
- జూన్ 17న
44. స్వామి సీతారామ శాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి 35 రోజులపాటు ఏ సంవత్సరంలో నిరాహార దీక్ష చేశాడు ?
- 1951
45.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది ? - 1953
46. పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది ?
- హైదరాబాద్ భవన్ (ఢిల్లీ)లో ఫిబ్రవరి 20, 1956లో
47.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ? - మహర్షి కార్వే
48.భరత ఖండంబు చక్కని పాడియావు.. అని తెలుగులో రచన చేసిన వారు ? -చిలకమర్తి లకీë నరసింహారావు
49. వీరగంథం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ.. అని పలికినవారు ? - త్రిపురనేని రామస్వామి చౌదరి
50. మా కొద్దీ తెల్ల దొరతనం రచియత ఎవరు ?
- గరిమెళ్ల సత్యనారాయణ
51.కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ, కోమటై పుట్టితేనేమి అని రచించినది ఎవరు ? - బసవరాజు అప్పారావు
52. హిమాలయోత్తుంగ శృంగం నా బతుకు అన్నది ?
- అడవి బాపిరాజు
53.రత్తాలు - రాంబాబు రచన ఎవరిది ?
- రాచకొండ విశ్వనాథశాస్త్రి
54.మైదానం, అమీనా, మ్యూజింగ్స్ ఎవరి రచనలు ?
- గుడిపాటి వెంకటాచలం
మోడల్ ప్రశ్నలు...
1.5 లక్షల సంవత్సరం నుంచి మనిషి సాగించిన జీవిత యాత్రను
ఏమంటారు ?
1. చరిత్ర 2. ఆదిమ చరిత్ర
3. సంధి కాలం 4. చారిత్రక యుగం
2. అనాది కాలం నుంచి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి గురించి వివరించేదే ?
1. నాగరికత 2. సంస్కృతి
3. చరిత్ర 4. సంప్రదాయం
3.ప్రపంచ మానవ చరిత్రను ఎన్ని విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు ?
1. మూడు 2. రెండు
3. నాలుగు 4. అయిదు
4. ఏ యుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు ?
1. చారిత్రక యుగం 2. సంధికాలపు చారిత్రక యుగం
3. పూర్వ చారిత్రక యుగం 4. ఆదిమకాలం
5. ప్రాచీన కాలం నాటి వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రం ?
1. మానవ శాస్త్రం 2. జీవ శాస్త్రం
3. పూర్వ శాస్త్రం 4. పురావస్తు శాస్త్రం
6.భూమి ఏర్పడి 100 కోట్ల సంవత్సరాలు అయితే మనిషి లాంటి జీవులు ఎన్నేళ్ల కిందట నివసించాయి ?
1. 20 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య 2. 50 లక్షల నుంచి 40 లక్షల సంవత్సరాల మధ్య
3. 60 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య 4. 30 లక్షల నుంచి 40 లక్షల సంవత్సరాల మధ్య
7. ప్రాచీన తవ్వకాలను ఏమంటారు ?
1. పిరమిడ్లు 2. ఉత్ఖాతనం
3. పురావస్తు 4. మానవశాస్త్రం
8. ఉత్ఖాతనాల గురించి తెలిపే శాస్త్రం ?
1. పురావస్తుశాస్త్రం 2. మానవశాస్త్రం
3. జీవశాస్త్రం 4. భూగోళశాస్త్రం
9. మానవ సంస్కృతి అభివృద్ధి ఎన్నివేల సంవత్సరాల పూర్వం నుంచి ఆరంభమైంది ?
1. 5 వేల సంవత్సరాలు 2. 10 వేల సంవత్సరాలు
3. 30 వేల సంవత్సరాలు 4. 20 వేల సంవత్సరాలు
10. హరప్పా, మొహంజదారో తవ్వకాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
1. వి.ఎ స్మిత్ 2. గోర్టోన్ చైల్డ్
3. మార్టిమర్ వీలర్ 4. జాన్ మార్షల్
11.ఇక్ష్వాకుల కాలం నాటి నాగరికత అవశేషాలు బయట పడిన ప్రాంతం?
1. దేవరకొండ 2. జగ్గయ్యపేట
3. నాగార్జునకొండ 4. మైసోలియా
12. ప్రాచీన వస్తువులను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించింది ?
1. మార్టిమర్ వీలర్ 2. హెరిడోటన్
3. టాలమీ 4. టాసిటస్
13.భూమిపై ఏర్పడిన మొదటి ప్రాణి ?
1. ప్లాజిలెట్టా 2. లార్వా
3. నిషియన్ 4. ఎరక్టస్
14. కిందివాటి ఆవిర్భావ క్రమాన్ని వివరించండి ?
1. లార్వా, ప్లాజిలెట్టా, వృక్ష, జంతుజాలాలు, మానవుడు 2. ప్లాజిలెట్టా, లార్వా, వృక్ష, జంతుజాలాలు, మానవుడు
3. లార్వా, ప్లాజిలెట్టా, మానవుడు, వృక్ష, జంతుజాలాలు 4. లార్వా, వృక్ష, జంతుజాలాలు, ప్లాజిలెట్టా, మానవుడు
15.ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు ?
1. అస్ట్రోఫిథికస్ 2. రామాఫిథికస్
3. హోమోసెపియన్స్ 4. హోమెఎరక్టస్
16. క్రోమాగన్లు అని ఎవరిని పిలుస్తారు ?
1. హోమోఎరక్టస్ 2. అస్ట్రోఫిథికస్
3. హోమోసెపియన్స్ 4. రామాఫిథికస్
17. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునకొండ వద్ద బయటపడిన నాగరికత ఏ శతాబ్దానికి చెందింది ?
1. క్రీ.శ 5 2. క్రీ.శ 2
3. క్రీ.శ 3 4. క్రీ.శ 4
18. మానవ పరిణామ దశలో మొదటిది ?
1. అస్ట్రోఫిథికస్ 2. రామాఫిథికస్
3. హోమోఎరక్టస్ 4. హోమో సెపియన్స్
19. మానవుడు నిప్పును ఏ యుగంలో కనిపెట్టాడు ?
1. మధ్య శిలాయుగం 2. పాతరాతి యుగం
3. లోహ యుగం 4. కొత్తరాతి యుగం
20. మానవుడు ఏ యుగంలో దేశదిమ్మరిగా జీవించాడు ?
1. పాతరాతి యుగం 2. మధ్యరాతి యుగం
3. కొత్తరాతి యుగం 4. లోహ యుగం
21. సాంఘిక సంబంధాలు, నిబంధనలు ఏ యుగంలో ఏర్పడ్డాయి ?
1. కొత్తరాతి యుగం 2. పాతరాతి యుగం
3. లోహ యుగం 4. మధ్యరాతి యుగం
22. మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టిన కాలం ?
1. మధ్యరాతి యుగం 2. పాతరాతి యుగం
3. కొత్తరాతి యుగం 4. లోహ యుగం
23. మానవుడు చక్రాన్ని ఏ యుగంలో కనుక్కొన్నాడు ?
1. మధ్యరాతి యుగం 2. లోహ యుగం
3. కొత్తరాతి యుగం 4. పాతరాతి యుగం
24. మట్టి కుండలను మానవుడు ఏ యుగంలో తయారు చేశాడు ?
1. పాతరాతి యుగం 2. కొత్తరాతి యుగం
3. మధ్యరాతి యుగం 4. లోహ యుగం
25. చేనేత కళ ఏ శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది ?
1. రసాయన శాస్త్రం 2. వృక్ష శాస్త్రం
3. భౌతిక శాస్త్రం 4. జంతు శాస్త్రం
26. పత్తి పంటను పండించడం ఏ శాస్త్ర అభ్యసనానికి దారి తీసింది ?
1. జంతు శాస్త్రం 2. వృక్షశాస్త్రం
3. భౌతిక శాస్త్రం 4. రసాయన శాస్త్రం
27. ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు దోహదపడింది?
1. వ్యవసాయం చేయడం 2. నిప్పును కనుక్కోవడం
3. చక్రిం ఆవిష్కరణ 4. కుండల తయారీ
28. దేవతలు, మానవుల మధ్య మధ్యవర్తులుగా ఎవరిని భావిస్తారు ?
1. రాజులు 2. పూజారులు
3. సైనికులు 4. దేవాలయాలు
29. మిశ్రమ వ్యవసాయం అంటే ?
1. వ్యవసాయం 2. పశుపోషణ
3. వ్యవసాయం, పశుపోషణ 4. పైవన్నీ
30. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ?
1. మెసపటోమియా నాగరికత 2. ఈజిప్ట్
3. పర్షియా 4. మెసపటోమియా, ఈజిప్ట్
31. మనిషి మొదట వాడిన లోహం ?
1. వెండి 2. రాగి
3. కంచు 4. ఇనుము
32. సంస్కృతి అంటే ?
1. తాత్విక చింతన 2. నాగరికత
3. సంప్రదాయం 4. లలిత కళలు, తాత్విక చింతన
33. జైళ్లలో దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా 63 రోజులపాటు నిరాహారదీక్ష చేసి మరణించిన వ్యక్తి ?
1. జతిన్ దాస్ 2. చంద్రశేఖర్ ఆజాద్
3. భగత్‌సింగ్ 4. గద్దర్
34. రైతులు విదేశీపాలన నుంచే కాక భూస్వాములు, పెట్టుబడిదారుల పాలన నుంచీ విముక్తి పొందాలన్న వ్యక్తి ?
1. భగత్‌సింగ్ 2. ఎన్.ఎ.డాంగే
3. పుచ్చలపల్లి సుందరయ్య 4. సుభాష్ చంద్రబోస్
35. అఖిల భారత కిసాన్ సభ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
1. లాలా లజపతి రారు 2. ఆచార్య నరేంద్రదేవ్
3. జయప్రకాశ్ నారాయణ్ 4. స్వామి సహజానంద సరస్వతి
సమాధానాలు: 1.2, 2.3, 3.1, 4.3, 5.4, 6.1, 7.2, 8.1, 9.2, 10.4, 11.3, 12.1, 13.2, 14.1, 15.3, 16.3, 17.3, 18.1, 19.1, 20.1, 21.4, 22.3, 23.3, 24.2, 25.3, 26.2, 27.3, 28.2, 29.3, 30.4, 31.2, 32.4, 33.1, 34.1, 35.4,