హోసురు : ప్రముఖ వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటారు కంపెనీ గత నవంబరు నెలలో 266582 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2018 నవంబరులో 319965 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. దీపావళి పండుగ సీజిన్ క్రిందటి నెలకు మారడం, బిఎస్ 4 స్టాక్స్ అడ్జెస్ట్మెంటు ప్రణాళికల వల్ల విక్రయాల్లో ఈ వ్యత్యాసం ఏర్పడిందని టివిఎస్ మోటారు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారీగా తగ్గిన టివిఎస్ విక్రయాలు
