ముంబయి : రాణా కపూర్ ప్రమోటర్‌గా ఉన్న యస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్, యెస్ బ్యాంక్‌లో తమకున్న మిగిలిన 0.8 శాతం వాటాను విక్రయించినట్లు యెస్ బ్యాంక్ మంగళవారం ఎక్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఈ ప్రమోటర్ కంపెనీలు ఓపెన్ మార్కెట్ ద్వారా నవంబర్ 13-14 తేదీలలో 2.04 కోట్ల షేర్లను విక్రయించాయి. ప్రస్తుతం రాణా కపూర్ కేవలం 900 యస్ బ్యాంక్ షేర్లకు మాత్రమే పరిమితం కావడం విశేషం. దీనికి ముందు యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్, రాణా కపూర్ కలిసి 552 లక్షల షేర్లు లేదా 2.16 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా సెప్టెంబర్ 26-27 తేదీలలో విక్రయించిన విషయం తెలిసిందే.
యెస్ బ్యాంకులో రాణా కపూర్ వాటాల విక్రయం..
