ముంబయి : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ షేరు కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఈ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ ఇంట్రాడేలో రూ.9.5 లక్షల కోట్లకు చేరింది. ఇది భారత మార్కెట్లో ఈ మైలురాయిని నమోదు చేసిన తొలి కంపెనీగా నమోదయ్యింది. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్‌లో 3.52 శాతం పెరిగి రూ.1509.80 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.9,57,049.13 కోట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ ఇండిస్టీస్ రికార్డు
