- దిగుమతులదీ అదే దారి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో మూడవసారి ఎగుమతులు క్షీణించాయి. గత నెలలో ముడి చమురు, రత్నాలు , ఆభరణాలు, ఇంజనీరింగ్ వంటి వస్తువుల వాణిజ్య క్షీణతతో అన్ని ప్రధాన విదేశీ మారక ద్రవ్యాల (ఫారెక్స్) వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీసింది. సెప్టెంబర్‌లో వాణిజ్య ఎగుమతులు 6.57 శాతం పడిపోయి మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. సెప్టెంబరులో వరుసగా నాల్గవ నెలలో 13.85 శాతం దిగుమతులు సైతం తగ్గుముఖం పట్టేసరికి ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ లేక మందగమనానికి దారి తీసింది. దీంతో సరుకుల వాణిజ్య లోటు సెప్టెంబరులో 10.86 బిలియన్ డాలర్లకు పడిపోయింది, ఇది ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. 'ముడి చమురు, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, ఇరాన్, టర్కీ, ఇతర గల్ఫ్ దేశాలలో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్లే వస్తువుల ధరలు తగ్గి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని, అనిశ్చిత పెట్టుబడుల ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేసిందని, దీంతో కరెన్సీ అస్థిరతకు దారితీసింది'అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు శరద్ కుమార్ సరాఫ్ అన్నారు.
నిస్తేజ ఎగుమతులు
ఎగుమతులు ప్రధానంగా ఉన్న వాణిజ్యం 2019-20 లో పలుమార్లు నిస్తేజంగా మారింది. ఆగస్టులో 6.05 శాతం తగ్గుముఖంగ పట్టగా, ఇది జూన్‌లో 41 నెలల కనిష్ట స్థాయి 9.7 శాతానికి చేరుకుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తాజా నెలలో ఎగుమతులు 26.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 30 ప్రధాన ఎగుమతి రంగాలలో 22 వాటిలో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు ఏర్పడగా, ఆగస్టులో ఏడు రంగాలు మాత్రమే పతనమయ్యాయి. ఉత్పత్తి చేసిన పెట్రోలియం వంటి క్లిష్టమైన ఎగుమతులు దెబ్బతిన్నాయి, ఎగుమతులు 18 శాతానికి పైగా పడిపోయి 3.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. క్షీణత ఆగస్టు 10 శాతం కంటే ఎక్కువ తేడాతో ఉంది. జూలై నుండి చమురు ఎగుమతుల పతనం వేగవంతమైంది, జామ్‌నగర్, మంగళూరులోని ప్రధాన శుద్ధి కర్మాగారాలు మూసివేతకు గురయ్యాయి. ఈ రంగంలో ఎగుమతులు త్వరలో పెరుగుతాయని తాము భావిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. రత్నాలు, ఆభరణాల రంగంలో మందగమనం గత నెల నవంబర్ నుండి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగింది. ఈ రంగం 5.56 శాతం తగ్గి 3.58 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను రవాణా చేసింది. జూలైలో రత్నాల ఎగుమతులు 3.54 శాతం తగ్గాయి. నీరవ్ మోడీ కుంభకోణం తరువాత నిధుల లభ్యత మందగించడంతో ఈ రంగంలో ఎగుమతుల వేగం దెబ్బతింది. మొనుపటి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చూసిన వాటిల్లో ఒకటైన ఇంజనీరింగ్ వస్తువులు కూడా బాగా నష్టపోయాయి. ఇది తాజా నెలలో 6.2 శాతం పడిపోయింది, ఆగస్టులో ఇది 9.35 శాతం క్షీణించింది. ఫారెక్స్‌లో దాదాపు 25 శాతం ఈ రంగం వాటా కలిగి ఉంది. అధిక ముడి పదార్థాల వ్యయం, ప్రధానంగా ఉక్కు వంటి సమస్యలను తాము పరిష్కరించుకోవాలని ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ రవి సెహగల్ తెలిపారు. రెడీమేడ్ వస్త్రాల ఎగుమతి కూడా నేలచూపులు చూస్తోంది. ఆగస్టులో ఇది 2.17 శాతం తగ్గింది. ఈ రంగం జూలైలో 7.66 శాతం వ ద్ధితో స్థిరంగా కోలుకునే సంకేతాలను చూపించింది. చమురేతర, రత్నాల, ఆభరణాల ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబర్‌లో 4.2 శాతం తగ్గాయి. ఆగస్టులో 5.61 శాతం కంటే తక్కువ పతనానికి చేరుకుంది.
దిగజారిన దిగుమతులు
దిగుమతి బిల్లులో అతిపెద్ద భాగం ముడిచమురు. దిగుమతి సరుకుల ఖర్చు సెప్టెంబరులో 18 శాతం తగ్గి 8.97 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 22 శాతం భారీగా పడిపోయిన నేపథ్యంలో ముడి చమురు దిగుమతులు గత నెలలో 9 శాతం తగ్గాయి. మరోవైపు, దిగుమతి బిల్లులో రెండవది బంగారం కూడా పెద్ద యెత్తున తగ్గుతూ వచ్చింది. ఆగస్టు, జూలైలలో 62 శాతం, 42 శాతం క్షీణత తరువాత బంగారు ఎగుమతులు 50 శాతం భారీగా తగ్గాయి. పరిశ్రమ అస్థిరతను చూస్తూనే ఉన్నప్పటికీ, జూన్ నుండి కుప్పకూలిపోయే ముందు, 2019 ప్రారంభంలో బంగారం దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. 'బంగారు దిగుమతుల నిరంతర క్షీణత విలువైన దాని ధర పెరుగుదలను ప్రతిబింబిస్తుంది, ఇది విలువైన రాళ్ల దిగుమతుల్లో అస్థిరతకు దారి తీసింది పండుగ,వివాహ కాలం కారణంగా ఇటువంటి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కొంతవరకు పునరుద్ధరించవచ్చు 'అని ఐసిఆర్ఎ ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు. చమురేతర, బంగారం కాని దిగుమతులు సెప్టెంబర్‌లో వరుసగా 11 వ నెలలో పడిపోయాయి, ఆగస్టు 9 శాతం మాదిరిగానే 8.88 శాతం కుదించాయి. 2019 సెప్టెంబరులో ఊ హించిన దాని కంటే తక్కువ వాణిజ్య లోటు తరువాత, 2018-19 రెండవ త్రైమాసికంలో (క్యూ 2) లో సుమారు 19 బిలియన్ డాలర్ల నుండి, ప్రస్తుత ఆర్థిక లోటు ఎఫ్వై 20 రెండవ త్రైమాసికంలో (క్యూ 2) 8-9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు.
సెప్టెంబర్‌లో క్షీణించిన ఎగుమతులు
