న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ఆర్ధిక మాంద్యాన్ని నివారించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్పటికీ.. భారత మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్టు 26తో ప్రారంభమయ్యే వారంలో సీతారామన్ ప్రకటనతో సానుకూలత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఇతర అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జూన్ త్రైమాసికానికి సంబంధించి దేశ జిడిపి గణాంకాలు ఆగస్టు 30న వెల్లడి కానున్నాయి. వచ్చే గురువారం నాటితో ఆగస్టు సిరీస్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగియడం తదితర అంశాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేసే అవకాశాలున్నాయి.
మార్కెట్లలో అప్రమత్తం..!
