కంటి కాన్సర్ చికిత్స పురుగతికై ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్ట్యూట్ (ఎల్విపిఇఐ) సంస్థ వ్యవస్థాపకులు గుళ్లపల్లి ఎస్ రావు, పోర్చుగల్ లిస్బాన్లోని ఆంటోనిమో షాంపాలిమౌడ్ ఫౌండేషన్ల అధ్యక్షులు డాక్టర్ లియోనార్ బెలేజా ఒక పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. కంటి కాన్సర్కు నూతన పరిజ్ఞానాన్ని, చికిత్స విధానాలను అందుకోవడమే ఈ ఒప్పంద లక్ష్యమని రావు పేర్కొన్నారు. కంటి కాన్సర్ చికిత్స పరిష్కారాలను కొనుగొనడంలో షాంపాలిమౌండ్ అత్యంత నైపుణ్యత కలిగి ఉంది.
కాన్సర్పై పోరాట ఒప్పందం..
