ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో
ఇసుజు మోటార్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ డీలర్షిప్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోన్నట్లు తెలిపింది. కొత్తగా అనంతపురంలో అమ్మకాలు, సర్వీసు, ఉపకరణాలకు సంబంధించిన నూతన 3ఎస్ ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ఇది తమకు 6వ ఆధీకృత ఔట్లెట్ అని ఇసుజు మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ తకేషీ హిరానో తెలిపారు.. దీన్ని సస్య ఆటోమోటివ్స భాగస్వామ్యంతో తెరించామన్నారు. ఇప్పటికే నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఔట్లెట్లు కలిగి ఉన్నామన్నారు. కొత్తగా తెరించిన షోరూంలో ఇసుజు డిమాక్స్ పికప్స్, ఇసుజు ఎంయు-ఎక్స్, 7 సీటర్ ఫుల్‌సైజ్ ఎస్‌యువిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా తాము ఇప్పటి వరకు 12,000పైగా డెలివరీ చేశామన్నారు. వీటిని శ్రీసిటీలోని తమ ప్లాంట్‌లో 2016 నుంచి తయారు చేసినట్లు తెలిపారు. ఇసుజు బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని సస్య ఆటోమోటివ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ రావు తెలిపారు.
రాష్ట్రంలో ఇసుజు మోటార్స్ విస్తరణ
