ముంబయి : వివిధ పరిణామాల మధ్య మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురైయ్యాయి. తుదకు సెన్సెక్స్ నష్టపోగా, నిఫ్టీ స్వల్ప లాభంలో నమోదయ్యింది. బిఎస్ఇ సెన్సెక్స్ 26 పాయింట్లు తగ్గి 37,877కు పడిపోయింది. 37,849 వద్ద మొదలైన సూచీ ఓ దశలో 37,877 గరిష్ట స్థాయిని తాకగా, మరో దశలో 37,587 కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 2.35 పాయింట్లు పెరిగి 11,389 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో టాటా స్టీల్ 3.61 శాతం, ఆసియన్ పెయింట్ 1.63 శాతం, ఎన్టిపిసి 1.31 శాతం, వేదాంతా 1.25 శాతం చొప్పున అధికంగా పెరిగిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు ఆసియన్ పోర్ట్సు 6.49 శాతం, కోల్ ఇండియా 2.63 శాతం, ఎస్బిఐ 1.47 శాతం, ఒఎన్జిసి 1.24 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఒడుదొడుకుల్లో మార్కెట్లు..
