- ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ
లుథియానా: ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీని అపార్థ చేసుకున్న వారు పుకార్లు, సొంత దురాభిప్రాయాలను ఇతరులకు చేరవేసి ప్రజల్ని భయోపేతులను చేశారన్నారు. గతంలో తొలత మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని ఆయన అన్నారు. జీఎస్టీని అపార్థం చేసుకొని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. జీఎస్టీ చాలా సులభమైన పన్ను విధానమని అన్నారు. ఈ విధానంలో పన్ను చెల్లింపుదారుల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండానే.. ఆన్లైన్ ద్వారా అన్ని పన్ను కార్యకలాపాలు సాగించే వెసులుబాటు ఇందులో ఉందని తెలిపారు. అయితే పన్ను ఎగవేయాలనే ప్రయత్నించే వారికి మాత్రం జీఎస్టీతో తిప్పలు తప్పవని అన్నారు. తమ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రం కూడా జీఎస్టీకి మద్దతు పలికిందని ఆయన అన్నారు. ఇది ఆహ్వానించదగ్గ అనందకరమైన చర్య అన్ని ఆయన అన్నారు.
జిఎస్టీపై అపార్థాలొద్దు
