- అమ్మకానికి 1.7 కోట్ల మంది వివరాలు
న్యూఢిల్లీ: హ్యాకింగ్ భూతం రోజుకో రూపంలో వ్యాపార ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఆన్లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమోటో వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. సంస్థకు సంబంధించిన దాదాపు 1.7 కోటి మంది ఖాతాలు సైబర్ తస్కరనకు గురయ్యాయి. తమ కంపెనీ వెబ్ సైట్, డేటాబేస్ పై భారీ సైబర్ ఎటాక్ జరిగిందని సంస్థ నిర్వాహకులు గురువారం తెలిపారు. డేటా బేస్ నుంచి సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించడాన్ని సంస్థ ధ్రువీకరించింది. సైబర్ దాడి ద్వారా తమ ఖాతాదారుల పేర్లు, పాస్ వర్డులను వారు చేజిక్కించు కున్నారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖతాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా సూచించింది. మొత్తం 120 మంది మిలియన్ యూజర్లలో సుమారు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులు చోరీకి గురైనట్టు గుర్తించామని జొమాటో వెల్లడించింది. చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత భద్రతా (పీసీఐ సెక్యూరిటీ) వ్యవస్థలో ఉంచినందువల్ల ఈ సమాచారం భద్రంగా ఉన్నట్టుగా తెలిపింది. ఎన్‌క్లే అనే డార్క్‌వెబ్ వెండార్ తానే ఈ హ్యాంకింగ్‌కు పాల్పడినట్టుగా ప్రకటించాడు. తస్కరించిన సమాచారాన్ని ఎన్‌క్లే డార్క్‌వెబ్‌లో అమ్మకానికి కూడా ఉంచడం విశేషం.
హ్యాకింగ్‌కు గురైన జొమోటో..!
