న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు మాసంలో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 7 శాతం పెరుగదల చోటు చేసుకుందని అంచనా. మారుతి సుజుకి, హ్యుం దారు కొత్త మోడళ్లను ఆవిష్కరిం చడంతో ఈ రంగానికి మద్దతు లభించింది. మరోవైపు హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసు కుంది. టొయాటో, టాటా మోటార్స్ విక్రయాల్లో ఒక్క అంకె వృద్ధి నమోదయ్యింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి క్రితం ఆగస్టు అమ్మకాల్లో 6.4 శాతం పెరిగి 1,17,864 యూనిట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు ఏకంగా 8.6 శాతం వృద్ధితో 1,06,781 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందారు విక్రయాలు 40వేల యూనిట్లకు చేరాయి.
వాహన అమ్మకాల్లో 7% వృద్ధి
