మహేశ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగీత ఒరవడి ప్రారంభమైంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం నేడు సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది. 'మైండ్ బ్లాక్' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదండోయ్ ఈ సినిమా నుంచి మిగిలిన నాలుగు పాటలను కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
'సరిలేరు నీకెవ్వరు' మైండ్ బ్లాక్ సాంగ్
