అనంతపురం : గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ బూచేపల్లి గ్రామంలో ఉన్న నిజమాయలమ్మ ఆలయంలో శుక్రవారం నూతన విగ్రహ పున:ప్రతిష్ట ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ విచ్చేసి అమ్మవారికి కుంభాభిషేకం జరిపించారు. గోరంట్లకు చెందిన భాస్కర తారానాథస్వామి, మంత్రికి ఘన స్వాగతం పలికి ఆయనను సన్మానించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అన్ని హామీలను నేరవేర్చి ప్రజారంజక పాలనను అందించే దిశలో పూర్తిగా విజయం సాధించాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు మంత్రి శంకర నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల వైసిపి కన్వీనర్ ఫక్రుద్దీన్, మాలగుండ్ల మల్లికార్జున, సోమందేపల్లి మండల వైసిపి కన్వీనర్ వెంకట రత్నం, మండల బూత్ కమిటీ ఇన్చార్జి నరసింహమూర్తి, ఇతర వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామంలోని వైసిపి నాయకులు, బియ్యంఅంగడి ఆనంద గ్రామస్తులు పాల్గన్నారు.
నిజమాయలమ్మ ఆలయంలో నూతన విగ్రహ పున:ప్రతిష్ట
