కాకినాడ: వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంతో లక్షా 35వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. మీకిచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా ఉంటానని చెప్పానన్నారు. మత్స్యకార పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యకారుల బాధను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 16వేల మంది మత్స్యకారులు హక్కుల కోసం పోరాడారన్నారు. గంగపుత్రుల జీవితాలు మార్చే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు చనిపోతే రూ.10లక్షలు పరిహారం అందిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధమన్నారు. వేట నిషేధం కాలంలో రూ.10వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. ఈ డబ్బు నేరుగా మీ అకౌంట్లోనే వేస్తున్నానన్నారు. మత్స్యకారుల డీజిల్ రాయితీ రూ.9కి పెంచుతున్నామని పేర్కొన్నారు. ప్రజల బాధలను తీర్చేందుకే సీఎం సీటులో ఉన్నానన్నారు.
లక్షా 35వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి: సీఎం జగన్
