హైదరాబాద్ : ఆర్టీసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రూట్ పర్మిట్ల వివాదంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుండగా.. ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. షరతులు విధించకపోతే విధుల్లోకి చేరేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ పై నేటి సాయంత్రం సీఎం కేసీఆర్ సమీక్ష
