ఢాకా: బంగ్లా దేశ్ లో మాజీ పేస్ బౌలర్ షహదత్ హుస్సేన్ ను జాతీయ క్రికెట్ లీగ్ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. షహదత్ తోటి ఆటగాడిపై చేయి చేసుకున్నందుకు ఈ శిక్ష విధించారు. బంగ్లాదేశ్ లీగ్ లో భాగంగా ఖుల్నా డివిజన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా షహదత్ బౌలింగ్ సామర్ధ్యాన్ని అరాఫత్ సన్నీ అనే ఆటగాడు ప్రశ్నించాడు. దీంతో షహదత్ అతనిపై దాడి చేశాడు. ఇకనుంచి బంగ్లా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలోనూ షహదత్ కు అవకాశం ఉండదు.