అమరావతి : అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ పెట్టుబడి భరోసా పథకం అందజేస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. 45లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. గతంలో మొక్కజొన్న రైతుకు బోనస్ ఇస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు.
అర్హత ఉన్న కౌలురైతులకు భరోసా : మంత్రి కన్నబాబు
