మలికిపురం (తూర్పు గోదావరి) : అకస్మాత్తుగా భర్త మృతి చెందడంతో మనస్తాపానికి గురై వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. మలికిపురం మండల కేంద్రంలోని మలికిపురం గ్రామానికి చెందిన రాయుడు పద్మావతి (42) భర్త పెద్దిరాజు కొన్ని నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయాడన్న దిగులుతో ఉన్న పద్మావతి ని రెండు నెలల క్రితం రాజమండ్రి బంధువుల ఇంటి వద్ద ఉంచారు. (నిన్న) బుధవారం రాజమండ్రి నుండి మలికిపురం వచ్చిన పద్మావతి బిల్డింగ్ పైకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. పద్మావతికి ఒక పాప, బాబు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
