* కష్టపడి చదివితే విజయం మీదే...ఎంఎల్సీ ఐవి
ప్రజాశక్తి-రాజోలు : రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్), ఉభయ గోదావరి జిల్లాల పిడిఎఫ్ ఎంఎల్సీలు రాము సూర్యారావు, ఐ.వెంకటేశ్వర రావు, డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శుల నమూనా పరీక్షను స్థానిక బాలికోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. నమూనా పరీక్షను మండల విద్యాశాఖ అధికారి జొన్నలగడ్డ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ పరీక్షకు నియోజకవర్గంలో ఉన్న 335 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల పిడిఎఫ్ ఎంఎల్సీ ఐ.వెంవెంకటేశ్వర రావు(ఐవి) పరీక్షకేంద్రాలను పరిశీలించారు. గ్రామ సచివాలయ కార్యదర్శి అభ్యర్థులను ఉద్దేశించి ఐవి మాట్లాడుతూ కష్టపడి చదివితే విజయం వరిస్తుందని, ఆ దిశగా రానున్న గ్రామ సచివాలయ పరీక్షకు సమగ్రతతో చదివి ఉద్యోగం సంపాదించాలని ఆయన కోరారు. రెండున్నర గంటలలో పరీక్ష ఏ విధంగా వ్రాయాలి అనే అంశంపై అవగాహన కల్పించడం కోసమే నమూనా పరీక్ష ఏర్పాటు చేశామన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రామ సచివాలయ పరీక్షలలో ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్ష వ్రాసి విజయం సాధించాలని ఆయన కోరారు. రాష్ట్ర కౌన్సిలర్ నల్లి విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి జి.వి.రమణ, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి.భద్రం, యుటిఎఫ్ మండల గౌరవ అధ్యక్షుడు సిహెచ్. దుర్గ ప్రసాద్, కె. రామదుర్గ రావు, పి.సూర్య చంద్రరావు, కె.రామ సత్యనారాయణ.సిహెచ్. కేశవరావు, కె. శ్రీనివాస్, మట్టపర్తి నరసింహరావు, యు.శ్రీనివాస్, రేవు శ్రీనివాస్, ఎ.సత్తిబాబు, కె.వి ఎస్.ఎన్.బాబు, కట్టా రవి, కె.ఏసుబాబు, కె.రాజబాబు.పి.ఎస్.ఆర్ మూర్తి, ఎన్.ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

