టెస్టుల్లో వంద వికెట్లు తీయడమే తన లక్ష్యమని భారత బౌలర్ శ్రీశాంత్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్ కు బిసిసిఐ అంబుడ్స్మెన్ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. దీనిపై శ్రీశాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ' వచ్చే ఏడాదితో నా శిక్ష ముగుస్తుంది. టెస్టుల్లో ఇప్పటి వరకూ 87 వికెట్లు పడగొట్టాను. 100 వికెట్లు తీసి కెరీర్ ను ముగించడమే నా లక్ష్యం ' అని శ్రీశాంత్ పేర్కొన్నారు.
100 వికెట్లు తీయడమే లక్ష్యం : శ్రీశాంత్
