హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో.. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తగిన ఎమ్మెల్యేల బలం లేకపోవడం, మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయింది. దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గుత్తా సుఖేందర్‌రెడ్డికి అసెంబ్లీ కార్యదర్శి ధ్రువపత్రం అందజేశారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం..
