అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ పలు శాఖలపై కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు విద్యుత్ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సీఆర్డీఏపై జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని పనుల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజధాని పనుల పురోగతిపై ఇవాళ సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారు. 25 శాతానికి మించి జరగని పనులు ఇప్పటికే నిలిపివేశారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులు, పనుల పురోగతిపై అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేశారు.
నేడు పలు శాఖలపై సీఎం జగన్ కీలక సమీక్షలు
