హైదరాబాద్:హైదరాబాద్ నగరంలోని బర్కత్పూర, నల్లకుంట డివిజన్, రత్నానగర్లో బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా దెబ్బతీన్నాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
బీజేపీ నేత ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు
