ఢిల్లీ: బలమైన అంతర్జాతీయ సంకేతాలు, దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. గురువారం ఒక్కరోజే రూ. 280 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ. 34,020 పలికింది. అటు వెండి ధర కూడా నేడు దూసుకెళ్లింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్క రోజే ఏకంగా రూ. 710 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 39,070కు చేరింది.
34వేలు దాటిన పసిడి ధర
