హైదరాబాద్: ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు కోలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్ న్యూస్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్గా మారింది. ఈ నెల 13న చెన్నైలో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని పేర్కొంది.
ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని రాసింది. దాంతో ఈ వార్త కాస్తా సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రెజీనా మాత్రం దీని గురించి ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవల విడుదలైన ‘7’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక ఆమె పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.