సికింద్రాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. ఉద్యోగ విరమణ వయస్సు పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై బుధవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవల మినహా ఇతర వైద్య సేవలను నిలిపేశారు. ఉద్యోగ విరమణ వయస్సు పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతవరకూ సమ్మెను విరమించేదిలేదని డాక్టర్లంతా స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్ల సమ్మె
