మాంచెస్టర్: శిఖర్ ధవన్ స్థానంలో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అవుటయ్యాడు. రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 78 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 136 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 75, కోహ్లీ క్రీజులో ఉన్నారు.