విజయవాడ : రౌడీ షీటర్ కిలారి.సురేష్‌ను కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలో కలకలంరేపుతోంది. శనివారం అర్థరాత్రి కొందరు ఆటో డ్రైవర్లతో సురేష్ వాగ్వాదానికి దిగాడు. ఆపై ఆటోడ్రైవర్లు సురేష్‌పై కత్తులతో దాడి చేశారు. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీవీఆర్ ఫ్లై ఓవర్ వద్ద రక్తపు మడుగులో సురేష్ ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.
రౌడీ షీటర్ దారుణహత్య
