చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని సదుం మండలం గోడ్ల వారి పల్లి సమీపంలో బూరగా మంద క్రాస్ వద్ద అదుపుతప్పి వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే సత్యవేడు నుంచి పుంగనూరు రాంపల్లి వాసులు ఆదివారం వరిగడ్డిని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా బూరగా మంద క్రాస్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడింది. మొత్తం నలుగురు వ్యక్తులు ట్రాక్టర్‌పై ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి అంజప్ప తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యులు తెలిపారు. మరొక వ్యక్తి తోటి మధుకి తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ శివకుమార్, బుచ్చి లక్ష్మయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు.