బెంగుళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా కాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈమేరకు కాసేపట్లో కోహ్లీసేన బ్యాటింగ్ చేయనుంది. కాగా విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో చివరి బంతి వరకూ ఉత్కంఠభరింతంగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం విదితమే.