ఎపిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిఎస్, డిజిపి, ఎస్పి లు సహా ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఆధ్వర్యంలోని బృందంతో భేటీ అయిన పలు పార్టీల ప్రతినిధులు.. ఓటర్ల నమోదులో ఇబ్బందులు, సర్వేల పేరుతో ఓట్ల తొలగింపు, ఎన్నికల దృష్ట్యా అధికారుల బదిలీలు, మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కుల పంపిణీపై ఫిర్యాదులు చేశారు. అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని సునీల్ అరోరా తెలిపారు.
అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తాం : సునీల్ అరోరా
