అమరావతి : పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీజీ వెంకటేష్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. అమరావతిలో ఎపి సిఎం చంద్రబాబు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని సూచించారు. ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని ఆదేశించారు. పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు సంయమనం కోల్పోవద్దన్నారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు.
టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం
