కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో మంగళవారం నిర్వహించనున్న 'గణతంత్ర బచావో యాత్ర' ర్యాలీకి వస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా చాపర్‌ను మాల్డా ఎయిర్‌పోర్టులో దింపేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఆయన వచ్చే హెలికాప్టర్‌ను గోల్డెన్ పార్క్ హోటల్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో ల్యాండ్ చేయాలని చెప్పింది. ఈ నెల 18న బిజెపి రాసిన అభ్యర్థన లేఖను సమాధానంగా ఈ అవకాశాన్ని కల్పించిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. విమానాశ్రయం వద్ద ఉన్నతస్థాయి పనులు జరుగుతున్నాయని, ఇసుక, దానికి సంబంధించిన పరికరాలు ఉండటంతో హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సురక్షితం కాదని భావిస్తూ అనుమతిన్విడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో బిజెపి జనరల్ సెక్రటరీ ప్రశ్నిస్తూ ఒక లేఖను రాశారు. ల్యాండింగ్‌కు సురక్షితం కాదని చెప్పిన ప్రభుత్వం, ప్రతి బుధవారం తన ప్రభుత్వ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌ను ఎలా చేస్తుందంటూ ప్రశ్నించారు. అక్కడి హెలిప్యాడ్ మీద కొన్ని రోజుల క్రితం మమతా బెనర్జీకి వచ్చిన హెలికాఫ్టర్ ల్యాండ్ అవ్వగా..ఇప్పుడు అమిత్‌షాకు అనుమతినివ్వకపోవడం..ఆమె అధికార దుర్వినియోగానికి నిర్వచనమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. గత వారం సుప్రీంకోర్టు రాష్ట్రంలో అమిత్‌షా చేపడుతున్న 'గణతంత్ర బచావో యాత్ర'కు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
అమిత్‌షా చాపర్ ల్యాండింగ్‌కు అనుమతినివ్వని మమతా ప్రభుత్వం
