న్యూఢిల్లీ : అనారోగ్య కారణాలతో చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ప్రవేశపెట్టనన్ను మధ్యంతర బడ్జెట్‌కు దూరంగా ఉండనున్నారన్న ఊహగానాల నడుమ ఆయన హాజరుకానున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్న 66ఏళ్ల జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యంతర బడ్జెట్‌ను బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లోనే ప్రముఖమైన నిర్ణయాలను తీసుకోనుందని సమాచారం. రైతులకు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని పలు ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలు రూపొందించనున్నారని. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2016 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజున ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి జైట్లీ ఆ సంప్రదాయాన్ని మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇదే ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడం గమనార్హం.
బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న అరుణ్‌జైట్లీ
