వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న, భారత సంతతికి చెందిన అమెరికా మొదటి సెనెటర్ కమలా హారిస్ (54) బాల్టిమోర్ను తన ఎన్నికల ప్రచార కార్యాలయంగా ఎంచుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలో ఆ మేరకు ప్రకటన వస్తుందని అమెరికా ప్రధాన స్రవంతిలోని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జమైకా-భారతీ సంతతికి చెందిన హారిస్ 2016లో సెనెట్‌కు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆమె 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా వున్నారు. వాషింగ్టన్కు సమీపంలో వుండడం, అక్కడి వైవిధ్యత, పైగా తూర్పు టైమ్ జోన్లో వుండడం, ఈ కారణాలతో ఆమె బాల్టిమోర్ను ప్రచార కేంద్రంగా ఎంచుకున్నట్లు బాల్టిమోర్ సన్ తెలిపింది. గతేడాది మేరీలాండ్ గవర్నర్‌గా పోటీ చేసి ఓడిపోయిన బెన్ జెలస్ను కమలా హారిస్ బలపరిచారు. కాగా ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి సెనెటర్ కార్యాలయం తిరస్కరించింది. కాగా, ఇది సరైన చాయిస్ అని గవర్నర్ పదవికి పోటీ చేసిన మాజీ డెమోక్రటిక్ అభ్యర్ధి క్రిష్ విఘ్నరాజా వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచార కేంద్రాన్ని ప్రకటించిన సెనెటర్ కమలా హారిస్
