హైదరాబాద్ : శాసనసభలో మీ గవర్నరంటూ సంభోదించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించారు. మీ కాదు… మా గవర్నర్ అనండని అని సీఎం చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న కామెంట్స్‌పై కాంగ్రెస్ అభ్యంతరాల్ని కూడా సీఎం కేసీఆర్ ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తప్పేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనే పదం కాంగ్రెస్‌కు సహించట్లేదా? ఆత్మవంచన ఎందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు.
మీ కాదు… మా గవర్నర్ అనండి : సిఎం కేసిఆర్
