వాషింగ్టన్ : చైనాతో సాగించిన వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా ఖజానాకు కోట్లాది రూపాయిలు వచ్చి పడ్డాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ ఈ యుద్ధం, టారిఫ్ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కోట్ల రూపాయిల్లో నష్టపోయిందని ఒక నివేదిక వెల్లడించింది. చైనా, ఇతర విదేశీ దిగుమతులను లక్ష్యంగా పెట్టుకుని టారిఫ్లను విధించడాన్ని సమర్ధించుకుంటూ ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. అమెరికా పట్ల సక్రమంగా వ్యవహరించని చైనా, ఇతర దేశాలపై విధించిన టారిఫ్లతో ఖజానాకు కోట్లాది డాలర్లు సమకూరాయని ఆయన చెప్పుకున్నారు. ఇక్కడ ట్రంప్ చెబుతున్నది నిజమే అయినప్పటికీ 2018లో ఖర్చయిన మొత్తంతో పోలిస్తే వచ్చిన మొత్తం బకెట్లో ఒక నీటి బట్టంత అని సిఎన్బిసి వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సెప్టెంబరు 30 నాటికి, మొత్తం టారిఫ్ల వల్ల వసూలైనది700కోట్ల డాలర్లు కన్నా తక్కువగానే వుంది. ఏడాది మొత్తంగా ఖజానాకు అయిన 3,300కోట్ల డాలర్ల ఈ మొత్తం కేవలం 0.2శాతంగా వుంది. చైనా ఉత్పత్తులపై విధించిన టారిఫ్ల కారణంగా నెలకు వంద కోట్ల డాలర్లు వరకు కేవలం టెక్నాలజీ పరిశ్రమే నష్టపోయిందని రాయిటర్స్ ఒక నివేదికలో పేర్కొంది. వ్యవసాయ రంగమూ బాగా దెబ్బతింది.కేవలం సోయాబీన్ రైతులే 290కోట్ల డాలర్ల వరకు నష్టపోయారు.
చైనాతో వాణిజ్య యుద్ధం వల్ల అమెరికాకు కోట్లాది డాలర్లు నష్టం
