కడప : పేదలు వేసుకొన్న గుడిసెలను అమానుషంగా తగలబెట్టడాన్ని నిరసిస్తూ.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అట్లూరు మండలంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు శుక్రవారం ధర్నా చేపట్టారు. క్రాస్ రోడ్డు నుండి ర్యాలీగా సాగారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు నాగరాజు, రమణయ్య మాట్లాడుతూ.. ఇల్లు లేని మునక ప్రాంత వాసులు గురువారం వేసుకున్న గుడిసెలను, ఎవరూ లేని సమయంలో రెవెన్యూ అధికారులు తగలబెట్టడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
