- పరిస్థితి విషమం బెంగళూరుకు తరలింపు
శాంతిపురం : మండల పరిధిలోని తుమ్మిసి గ్రామానికి చెందిన గంగాధరం శెట్టి గత పది సంవత్సరాల నుంచి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రామకుప్పంలోని సగినేకుప్పం వద్ద విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సగినేకుప్పం మలుపు వద్ద జెసిబి గంగాధరం వాహనాన్ని ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన గంగాధరం శెట్టిని స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించి, అతనికి సపరిచర్యలు చేశారు. వెంటనే స్పందించిన రామకుప్పం పోలీసులు గంగాధరం శెట్టిని పిఈఎస్ మెడికల్ కళాశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. గంగాధరం శెట్టి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతనిని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కాగా గంగాధరం శెట్టికి ఇద్దరు కుమారులు శ్రీ సాయి, సాయి ప్రశాంత్ ఉన్నారు.
పరామర్శించిన డిఎస్పి:
ప్రమాదంలో గాయాలపాలైన గంగాధరం శెట్టిని చిత్తూరు డిఎస్పి యుగంధర్ పిఈఎస్ వైద్య కళాశాలలో పరామర్శించారు. గంగాధరం శెట్టి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తామున్నామంటూ వారికి భరోసానిచ్చారు. డీఎస్పీతో పాటు అర్బన్ సిఐ జి.టి నాయుడు రూరల్ సిఐ కృష్ణమోహన్, నాలుగు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.