కున్మింగ్ : హెచ్ఐవి వైరస్, ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం కుటుంబ స్థాయి చికిత్సతో పోరును ప్రారంభించింది. అక్టోబర్ చివరి నాటికి చైనాలోని యునన్ ప్రావిన్స్‌లో దాదాపు 1,05,600 (మొత్తం జనాభాలో ఎనిమిదో వంతు) మంది హెచ్ఐవి/ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు. చైనాలో ఎయిడ్స్‌పై పోరు కొనసాగిస్తున్న రాష్ట్రాలలో యునాన్ గత కొన్నేళ్లుఆ అగ్రస్థానంలో నిలుస్తోంది. చైనాలో ప్రతి పదివేల మందిలో తొమ్మిది మంది హెచ్ఐవి/ఎయిడ్స్ రోగులున్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలలో అత్యంత తక్కువ రేటు కావటం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి చైనాలో మొత్తం 12.5 లక్షల మంది ప్రజలు హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా వుంటారని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, యుఎన్ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోవెల్లడయింది. ఏటా దాదాపు 80 వేల మంది కొత్తగా ఈ సంఖ్యకు జత పడుతున్నారు. 2005 తరువాత హెచ్ఐవి/ఎయిడ్స్‌పై పోరాటానికి సంబంధించి నాలుగు విడతలు ప్రచారాన్ని నిర్వహించారు. దీనితో పాటు ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి, పరీక్షల నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా కుటుంబాలు, ఆయా సామాజిక వర్గాల స్థాయిలో చికిత్స అందించటంపై దృష్టి కేంద్రీకరించారు.
కుటుంబ స్థాయి చికిత్సతో ఎయిడ్స్‌పై చైనా పోరు
