తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16 నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


