న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో స్వల్పంగా ఇంధన చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా తొమ్మిదో రోజైన శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.80.85కి చేరింది. డీజిల్పై 7 పైసలు తగ్గి రూ.74.73కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.86.33కి నమోదు కాగా, డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ. 78.33కి చేరుకుంది.
స్వల్పంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు
