- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
రాయ్పూర్ : ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించడం ద్వారా పెట్రోలు, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వరిగడ్డి, గోధుమ, చెరుకు, ఇతర వ్యర్థాలు నుండి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే లీటర్ డీజిల్ రూ.50లకు, పెట్రోలు రూ.55లకు పొందవచ్చునని తెలిపారు. ఎథనాల్, మెథనాల్, జీవ ఇంధనం, సిఎన్జిలకు మరలడం వల్ల పెట్రోలు ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గుతుందని, వాటి ధరలు తగ్గడానికి వీలవుతుందని ఛత్తిస్ ఘడ్లో బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గన్న సందర్భంగా గడ్కరీ పేర్కొన్నారు.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఐదు ఎథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నదని, వీటిలో వరిగడ్డి, గోధుమ గడ్డి, చెరుకు, ఇతర వ్యర్థాల ద్వారా జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుందన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలతో లీటర్ డీజిల్ రూ.50, పెట్రోలు రూ.55లకే!
