విజయనగరం (బెలగాం): ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్వతీపురం సిఐ. జి.రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ... రోజు రోజుకి ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కొందరు పెరుగుతున్న టెక్క్నోలెడ్జి ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇటువంటి వారిపట్ల జాగ్రత్త వహించాలి. మీకు లక్కీ డ్రా వచ్చింది డబ్బులు కడితే మీ డబ్బుని మీకు ఇస్తాము అని మోసం చేస్తున్నారు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీ ‘ఓ.టి.పి’ పాస్వర్డ్ చెప్పండని ఎవరైనా కాల్ చేసిన మెసేజ్ చేసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఇటు వంటి వృత్తిపట్ల ఆకర్షితులు కావొద్దని, ముఖ్యంగా యువత వీటిపట్ల ఆకర్షితులు అవుతున్నారన్నారు. పోలీసులు వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని, ఇటువంటి మోసాలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదు అని తెలియ జేశారు.
ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి
