న్యూఢిల్లీ : తాము 70 ఏళ్ళలో చేసిన దాని కన్నా అధికంగా బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ళలోనే చేసి చూపిందంటూ ప్రధాని మోడి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడి వ్యాఖ్యలపై వ్యంగ్యోక్తులు విసిరారు. అవును, మోడి చెప్పింది నిజమేనంటూ ''దేశంలో ద్వేష భావం విస్తరించింది. దేశ ప్రజలు ఒకరితో మరకొరు పోట్లాడుకుంటున్నారు. గడిచిన 70 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైంది. ఇంధన దరలు ఆకాశాన్నంటాయి. వంట గ్యాస్ సిలండర్ ధర రూ.800 లు అయ్యింది. దేశ ప్రజలు విభజనకు గురయ్యారు. వారు ఎంతగానో అలసి పోయారు. దేశంలోని యువత బాగా అలిసిపోయింది.'' అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా జరిపిన ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలోని రామ్ లీల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ర్యాలీనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఇంధన ధరల్లో పెరుగుదలను వ్యతిరేకిస్తూ సోమవారం జరిగిన భారత్ బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతృత్వం వహించగా దాదాపు 20కి పైగా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రివాల్ నేతృత్వంలని ఆప్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు భారత్ బంద్‌లో పాల్గనలేదు.
దేశంలో విద్వేషం చెలరేగింది.. మోడిపై రాహుల్ వ్యంగ్యోక్తులు
